GuidePedia

0
పద్మిని జాతి స్త్రీ అందం కనులలో


 ఆహార్యం కనుబొమ్మలలో


 అణుకువతనం పెదవులపై ఒదిగిన మౌనంలో 




 రౌద్రం ఎర్రబడ్డ కనుజీరల్లొ


 కోపం కోటేరు ముక్కున మెరిసే ముక్కెరలో


 రాజసం చిరునవ్వులలో


 దర్పం ఎర్రబడ్డ ఆ చెక్కిళ్ళలో


 అభినయం కోడెత్రాచులాంటి వాలు జడలో


 సుకుమారం కొండవాగులాంటి నడువొంపులో

 
 లాలాసం సిగ చాటు మేని సొంపులలో


 జాణతనం నఖ శిఖ పర్యంతం అణువణువులో




 ప్రేమతత్వం ఎవ్వరికీ అందని అర్థం కాని మనసు 


లోతుల్లో ...

Post a Comment

 
Top