తెలంగాణ భాషకు గౌరవ ప్రతిష్ఠలు తెచ్చిన కాళోజీ
తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి నేడు. దీనిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సమైక్య రాష్ట్రంలో మరుగున పడ్డ తెలంగాణ మహనీయులలో కాళోజీ ఒకరు. స్వరాష్ట్రం కోసం ఆయన పడ్డ తపన ఆయన రచనల్లో కనిపిస్తుంది. అలాంటి గొప్ప మనిషికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఘననివాళి ఆయన జయంతిని భాషా దినోత్సవంగా ప్రకటించడం. అంతేకాకుండా ఆయన పేరు మీద నెలకొల్పిన కాళోజీ పురస్కారాన్ని సుప్రసిద్ద రచయిత అమ్మంగి వేణుగోపాల్ అందుకోనున్నారు.
![]() |
కాళోజి జయంతిని పురస్కరించుకొని ప్రకటన విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ “తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషకు అత్యంత గౌరవప్రతిష్ఠలు తెచ్చిన మహనీయుడు కాళోజీ అని, పోరాటాలతో, ఆరాటాలతో, త్యాగధనులతో నిలిచిన తెలంగాణ చరిత్రనిండా కాళోజీ చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని” కొనియాడారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను తన గొడవగా భావించి నా గొడవ పేరుతో వెలువరించిన సాహిత్యం తెలంగాణ ప్రజల గొడవ గా కీర్తి గడించిందని అన్నారు.
ప్రజాకవి కాళోజీకి తెలంగాణ ప్రభుత్వం విశిష్ట గుర్తింపు ఇచ్చింది. ప్రజాకవిగా ఎనలేని కీర్తి గడించిన కాళోజి నారాయణరావు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే సమైక్య రాష్ర్టంలో ఆయనకు సరైన గుర్తింపు రాలేదని భావించిన తెలంగాణ సర్కార్ ఆయనకు ఓ గొప్ప గౌరవం ఇచ్చింది. కాళోజి జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజి జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు.
కాళోజీ జయంతి రోజున రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భాష చైతన్య
కార్యక్రమాలు, వ్యాసరచన, ఉపన్యాసాలు, చర్చాగోష్టి నిర్వహించేలా ప్రభుత్వం
అధికారులను ఆదేశించింది. భాష, సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారికి కాళోజి
పురస్కారం ఇస్తామని సీఎం తెలిపారు. దీంతో కాళోజి నారాయణరావును కేసీఆర్
తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారన్న ప్రశంసలు
సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణ కవులు,
సాహితీ వేత్తలు, మేథావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమైక్య రాష్ర్టంలో వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి
పంతులు జయంతిని తెలుగు భాష అధికారిక దినోత్సవంగా నిర్వహించేవారు. అయితే
ఇక నుంచి తెలంగాణలో కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా
నిర్వహిస్తారు.





Post a Comment