GuidePedia

0


నేను రాజకీయాల్లోకి రావడానికో .. మరో స్వార్ధానికో గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు రాలేదు. గ్రామాల అభివృద్ది ప్రజల హక్కు. భవిష్యత్ లో కొండారెడ్డి పల్లి గ్రామ ప్రజలు ఇతర గ్రామాలను దత్తత తీసుకునే స్థాయికి ఎదగాలని” ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ ను కలిసి ప్రతిపాదించిన ప్రకాష్ రాజ్ ఈ రోజు గ్రామస్తులతో సమావేశం అయ్యారు.



ఈ రోజు ప్రకాష్ రాజ్ తో పాటు కలెక్టర్ శ్రీదేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లు పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్ గ్రామంలో మొక్కలు నాటారు.  కొండారెడ్డిపల్లి అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడుతానని,  ఎలాంటి అభద్రతాభావం లేకుండా గ్రామాభివృద్ధికి అందరూ పాటు పడాలని పిలుపునిచ్చారు.


 ప్రకాష్ రాజ్ కు ఈ ఊరి పక్కనే ఫాం హౌస్ ఉంది. అక్కడ ఆయన భూమి సాగు చేస్తూ వివిధ రకాల కూరగాయలు కూడా పండిస్తున్నారు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఇతర రాష్ట్రాలలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు కొండారెడ్డి పల్లి వాసులతో కలిసి గ్రామంలోని సమస్యలు, పనుల మీద ఆయన చర్చించారు.









Post a Comment

 
Top