GuidePedia

0

కొరియర్ బాయ్ కళ్యాణ్ రివ్యూ & రేటింగ్

CAST & CREW:

 హీరో హీరోయిన్:   నితిన్‌, యామీ గౌతమ్‌
సంగీతం           :     కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌
దర్శకత్వం        :    ప్రేమ్‌సాయి
నిర్మాణం          :     గురు ఫిలింస్‌
రేటింగ్             :     2/5

Plus:

కథాంశం కాస్త కొత్తగా ఉంది.
కొరియోగ్రఫి.
Minus:

స్క్రీన్ ప్లే.
లవ్ స్టోరి, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ.
మ్యూజిక్
డైరెక్షన్.
Rating:   2/5.

STORY:

కళ్యాణ్ (నితిన్)  డిగ్రీ ఫెయిలై ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ,   కావ్య (యామి గౌతమ్) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు . ఆ అమ్మాయి కోసమే  కొరియర్ బాయ్‌ పనిలో  చేరతాడు. ఈ లవ్ ట్రాక్ ఇలా నడుస్తుండగా.. ఊహించని లైన్ లోకి వెళుతుంది సినిమా.  విదేశాల్లో ఓ పెద్ద డాక్టర్ అయిన అశుతోష్ రానా అధిక డబ్బు కోసం ఓ పరిశోధన చేస్తుంటాడు.దాని కోసం ఇక్కడి డాక్టర్ల సహాయం తీసుకుంటాడు. డెలివరీ కోసం తమ, తమ హస్పిటల్స్ కు వచ్చిన గర్భవతులను వారికి తెలియకుండానే అబార్షన్ చేసి వారిలోని స్టెమ్ సెల్స్ ను సేకరించి అశుతోష్ రానా కు పంపుతుంటారు ఇక్కడి డాక్టర్లు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసుపత్రిలో పనిచేసే వార్డు బాయ్ హైద్రాబాద్‌లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి (నాజర్)కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొరియర్ చేస్తాడు. అదే కొరియర్ ..కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న నితిన్ చేతిలో పడుతుంది.  చివరకు కళ్యాణ్ ఆ కొరియర్ ను  సత్యమూర్తికి ఎలా  చేర్చాడు.. కొరియర్ చేర్చడంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందుల మొత్తమే కొరియర్ బాయ్ సినిమా.





Post a Comment

 
Top