తల్లితనానికి కొరివి పెట్టిన "సవతి తల్లి"..........!
ఆడదా...? మనిషి రూపంలో ఉన్న రాక్షశా.....?
ఆడదా...? మనిషి రూపంలో ఉన్న రాక్షశా.....?
తల్లి లేని బిడ్డను తల్లిలా సాకాల్సిన ఆ సవతి తల్లి.. తనకు పుట్టని కూతురిని చిత్రహింసల పాల్జేసింది. ఏడాదిపాటు గృహనిర్బంధంలో ఉంచి రాచిరంపాన పెట్టింది. ఆమె ముఖంపై యాసిడ్ పోసేంత పైశాచికత్వానికి ఒడిగట్టింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘోరమిది. చివరకు.. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బాలల హక్కుల కమిషన్ ఆ బాలికకు విముక్తి కలిగించారు. ఎల్బీనగర్ బండ్లగూడలోని ఆనంద్ నగర్ కాలనీకి చెందిన తిప్ప రమేష్ కుమార్ జూనియర్ టెలికాం అధికారిగా పని చేస్తున్నాడు. రమేష్‌కు 1995లో సరళాదేవితో వివాహమైంది. వీరికి ప్రత్యూష అనే కూతురు జన్మించింది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో.. 2003లో సరళాదేవి విడాకులు తీసుకుంది. కూతురు ప్రత్యూషతో కలసి నగరంలోని తన తల్లిదండ్రుల వద్దకు చేరింది. మరోవైపు రమేష్ 2008లో చాముండేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సరళా దేవి 2010లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ప్రత్యూషను మూసాపేటలోని ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. అయితే ప్రత్యూష బాగోగులు తాను చూసుకోగలుగుతానని అనాథాశ్రమ నిర్వాహకులకు చెప్పిన రమేష్.. 2014లో తన కూతుర్ని ఇంటికి తీసుకెళ్లాడు. మొదట్లో చాముండేశ్వరి ప్రత్యూషతో బాగానే ఉంది. నెల రోజుల తరువాత అసలు స్వరూపం బయటపెట్టింది. ఇంటి పని మొత్తం ప్రత్యూషతోనే చేయిస్తూ ఆమెను మానసికంగా, శారీరంగా చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టింది.చిన్న చిన్న పొరబాట్లకే.. ఒంటిమీద వాతలు పెడుతూ కొట్టేది. బయటకు వెళ్లనీయకుండా గృహనిర్భంధం చేసింది. ప్రత్యూష ఎదురుతిరిగితే.. ‘‘నీకు అందంగా ఉన్నానన్న పొగరు’’ అంటూ ఆమె ముఖంపై యాసిడ్‌పోసింది.కన్న కూతురు ఇన్ని బాధలు పడుతున్నా.. రమేష్ చూస్తూ ఊరుకున్నాడు తప్పితే అడ్డుకోలేదు. పైగా ఓ సందర్భంలో.. ప్రత్యూష తనకు పుట్టిన కూతురు కాదని చాముండేశ్వరితో అనడంతో ఆమె మరింత రెచ్చిపోయింది. అయితే.. ఆమె పైశాచికత్వాన్ని, ప్రత్యూష అనుభవిస్తున్న నరకాన్ని చూడలేకపోయిన స్థానికులు బాలల హక్కుల కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో కమిషన్ సభ్యుడు అచ్యుతరావు పోలీసుల సహకారంతో బుధవారంనాడు.. ప్రత్యూష ఇంటికి చేరుకుని ఆమెకు గృహనిర్భంధం నుంచి విముక్తి కల్పించారు.
"తానూ ఒక తల్లికి బిడ్డనే" అనే విషయం మరచి
మానవత్వాన్ని మంటగలిపిన ఈ "మానవ మృగాన్ని"
ఏం చేయాలో మీరే చెప్పండి.....?



Post a Comment