సీఎం కేసీఆర్ హరితహారం షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంలో
పాల్గొనే షెడ్యూల్ ఖరారైంది.
ఆకుపచ్చ
తెలంగాణ కోసం చేపట్టిన హరితహారం
పథకాన్ని సీఎం ఈ రోజు రంగారెడ్డి జిల్లా
చిలుకూరులో ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా
సీఎం బాలాజీ వెంకటేశ్వరుడిని
దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ హాస్టల్‌లో
మొక్కలు నాటుతారు. 4న హైదరాబాద్, మెదక్
జిల్లాలో. 5న కరీంనగర్, ఆదిలాబాద్‌లో.
6న నిజామాబాద్ జిల్లాలో జరిగే హరితహారం
కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
ఈ నెల 5న రాష్ట్రపతి యాదాద్రి పర్యటన దృష్ట్యా
సీఎం హరితహారం షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
ఉండనున్నాయి.5న ఉదయం
సీఎం హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ నుంచి
యాదాద్రికి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన
అనంతరం తిరిగి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి
సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు.




Post a Comment