రంజాన్ స్పెషల్... 'సలాం' చేస్తున్న బాహుబలి,
భల్లాలదేవ
బాహుబలి సినిమా యూనిట్ సందర్భోచితంగా వ్యవహరించింది. రంజాన్ ను
పురస్కరించుకుని 'బాహుబలి' పోస్టర్ ను విలక్షణ రీతిలో రూపొందించి,
విడుదల చేసింది.
బాహుబలి పాత్రధారి ప్రభాస్, భల్లాలదేవ పాత్రధారి రానా ముస్లిం సంప్రదాయ
దుస్తుల్లో అభివాదం చేయడం ఆ పోస్టర్లలో కనిపిస్తుంది. పైగా టైటిల్ ను
ఉర్దూలోనూ రాశారు.
ఈ సందర్భంగా బాహుబలి యూనిట్ ముస్లిం సమాజానికి రంజాన్
శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన
'బాహుబలి' చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకువెళుతోంది.
ఇక తెలుగులో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుకున్నతొలి సినిమాగా కూడా
బాహుబలి చరిత్ర కెక్కనుంది. ఇప్పటికే రూ.62.12 కోట్ల గ్రాస్ వసూళ్లను
రాబట్టిన బాహుబలి ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎనలిస్టులు సైతం
చెప్పలేకపోతున్నారు.
బాహుబలి ఫస్ట్ వీక్ ఏపీ+తెలంగాణ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
వైజాగ్ – 5.40 కోట్లు
గుంటూరు- 5.47 కోట్లు
ఈస్ట్- 5.13 కోట్లు
వెస్ట్- 4.35 కోట్లు
కృష్ణ- 3.64 కోట్లు
నెల్లూరు- 2.25 కోట్లు
ఆంధ్ర షేర్= 26.24 కోట్లు
తెలంగాణ = 23.73 కోట్లు
సీడెడ్- 12.15 కోట్లు
మొత్తం ఫస్ట్ వీక్ ఏపీ+తెలంగాణ కలెక్షన్స్= 62.12 కోట్ల షేర్‌ను
బాహుబలి సాధించింది.

Post a Comment