దైవం దృష్టి లో సమానత్వాన్ని..
ప్రకృతే పాటించలేదా....
మనుషులు మాత్రం ఎందుకు మతం,కులం,ప్రాంతం..
అన్న బేదాలు పాటిస్తారు...
పంచభూతాలకే..లేవే ఈ బేదాబిప్రాయాలు..
మరి మనుషులకి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయి...
ఏ గీత చెప్పింది ఈ కుల సాప్రదాయం.....
ఏ రామాయణం చెప్పింది పాటించొద్దని మత సామరస్యం...
ఏ బైబిల్,ఖురాన్ లు చెప్పాయి ఈ ప్రాంతీయ బేదాలు....
"నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే
పండరీ బంటు నిద్ర అదియునొకటే"
అని చెప్పిన అన్నమాచార్య కీర్తనకు..
సాక్ష్యత్ వేంకటేశ్వర స్వామే భువి కి కదిలి వచ్చాడు కదా..!
అందరినీ ప్రేమించమన్న యేసు చెప్పిన మాటలకి..
స్పందించిన దేశాల్ని ఏలిన రాజులే ఉన్నారు కదా..!
ఒక యాదవుడు అయిన కృష్ణున్ని,వేంకటేశ్వరుని
ఈ లోకం దైవం గా ఆరాదిస్తుంది కదా..
కనిపించని దేవుళ్ళలో చూసిన సమానత్వం..
కనిపించే మానవుల మీద ఎందుకు చూపించరు..?
ఎదుటి వాళ్ళను చంపడానికి తప్ప...
ఎందుకు పనికి వస్తాయి ఈ భేదాబిప్రాయలు..?
ఆత్మహత్యలకు పురికొల్పడం తప్ప..
ఏమి సాదిస్తాయి ఈ వివక్షతలు..?
గీత,బైబిల్,ఖురాన్ ల సారంశం "ప్రేమ" నే కదా..!
అది తప్ప మిగిలినవి అన్నీ చేస్తుందీ ఈ ప్రపంచం..
మనిషి ని మనిషి గా గౌరవించలేని మతాలెందుకూ..?
మానసికంగా కృంగదీసే కులాలెందుకూ..?
మానవత్వం చూపించలేని ప్రాంతలెందుకూ..?

Post a Comment