GuidePedia

0


ప్రతినిత్యం ఒక ఉసిరి కాయను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతారు. ఉసిరిలో విటమిన్-సి పోషకం మెండుగా ఉంటుంది. దీన్ని ఆహారంగానే కాదు చర్మం, జుట్టు, గుండె, అందానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి, అందాన్ని పెంచుకోవడానికి చలికాలంలో ప్రకృతి ఇచ్చిన నేస్తం ఉసిరి. పరిమాణంలో చిన్నదైనా ప్రయోజనాల్లో మాత్రం చాలా పెద్దది. ఉసిరితో లాభాలు 




* ఉసిరితో ఊపిరితిత్తుల సమస్య దూరమవుతుంది. 
* శ్లేష్మాన్ని తొలగిస్తుంది. 
* దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, అస్తమా తగ్గుతాయి. 
* కొవ్వును, రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది. 
* హృద్రోగాలు, మధుమేహం రాకుండా చేస్తుంది. 
* కాలేయ సామర్థ్యాన్ని, శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. 
* జీర్ణ సంబంధమైన అన్ని రకాల సమ్యలను నివారిస్తుంది. 
* పొట్టలోని రసాయనాలను సమతుల్యం చేస్తుంది. 
* శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. 
* ఉసిరిలోని విటమిన్-సి శరీరాన్ని ఎండ నుంచి రక్షిస్తుంది. 
* చర్మ రోగాల నుంచి కాపాడుతుంది. 
* గ్లాస్ నీటిలో కొన్ని ఉసిరి ముక్కలు, చక్కర వేసి మరిగించి ఆ నీటిని తాగితే చర్మం పగుళ్లు, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. 
* కేశ పోషణకు ఎంతో ఉపయోగపడుతుంది. 
* ఉసిరి పొడులు, శాంపులు, నూనెలు వాడితే బాలనెరుపుని, చుండ్రుని నివారించవచ్చు. 
* ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు, దంతాలు, గోళ్లు, కేశాలు బాగా పోరుగుతాయి.

Post a Comment

 
Top